ఈ దేశంలో రెండు సార్లు పళ్లు తోమితే నేరమట! రోజూ మీరు ఎన్నిసార్లు పళ్లు తోముతారు? ‘‘అదేం ప్రశ్న? ఒకటి లేదా రెండు సార్లు. ఒక్కోసారి అది కూడా చేయం’’ అని అంటారా? అయితే, ఆ దేశంలో మాత్రం ఒక్కసారే పళ్లు తోమాలి. ఔనా? రెండోసారి తోమితే ఏంటటా? అని అంటున్నారా? అయితే, అది మీకే రిస్కు. ఎందుకంటే అక్కడ ఒకే రోజు రెండు సార్లు బ్రష్ చేయకూడదట. అలా చేస్తే జరిమానా విధిస్తారట. ఇంతకీ దిక్కుమాలిన రూల్ పెట్టిన ఆ దేశం ఏమిటనేగా మీ తర్వాతి ప్రశ్న? అదేనండి, ఉక్రెయిన్‌పై విరుచుకుపడుతున్న రష్యా. రెండు సార్లు బ్రష్ చేస్తే పళ్లు పాడైపోతాయనే కారణంతోనే ఆ రూల్ అట. కానీ, ఇది ఒకప్పుడు ఉండేదని, ఇప్పుడు అమల్లో లేదని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది ఆ రష్యన్లకే తెలియాలి. అయినా, ఎన్నిసార్లు బ్రష్ చేశామనేది ఎవరు చూస్తారు చెప్పండి? Images and Videos Credit: Pexels, Unsplash & Pixabay