అల్లం రోజూ తినడం వల్ల ఈ బాధలు పోతాయి వంటల్లో అల్లాన్ని రోజూ వాడడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో జీంజెరోల్ అనే యాంటీ ఇన్ఫ్లమ్మేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్న పదార్థం ఉంటుంది. అల్లం తినడం వల్ల వికారం లక్షణాలు తక్కువగా కలుగుతాయి. ఆస్టియోపొరోసిస్ రాకుండా అడ్డుకోవడంలో ముందుంటుంది. మధుమేహం ఉన్న వారు అల్లం తింటే మంచిది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది. టైప్ 2 డయాబెటిస్ వచ్చే లక్షణాలను తగ్గిస్తుంది. అజీర్తి, మలబద్ధకం లక్షణాలను తగ్గిస్తుంది అల్లం. మహిళలకు రుతుస్రావం సమయంలో వచ్చే పొట్టనొప్పి తగ్గుతుంది.