డ్రైఫ్రూట్స్ చిక్కీ సింపుల్ రెసిపీ

బాదం పప్పులు - పదిహేను
జీడిపప్పులు - పది
పిస్తా పప్పులు - పది
గుమ్మడి గింజలు - మూడు స్పూన్లు

ఎండు నల్లద్రాక్షలు - పది
నువ్వులు - నాలుగు స్పూన్లు
బెల్లం తురుము - ఒక కప్పు
నీళ్లు - సరిపడా
నెయ్యి - ఒక చెంచా

బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, ఎండు నల్లద్రాక్షలు సన్నగా తరుక్కోవాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి డ్రై ఫ్రూట్స్‌ని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి.

అదే కళాయిలో ఒక చెంచా నెయ్యిలో కప్పు బెల్లం, కాస్త నీరు వేసి బాగా కలుపుకోవాలి.

బెల్లం పాకం వచ్చాక అందులో ముందుగా వేయించిన నట్స్‌తో పాటూ,నువ్వులు, గుమ్మడి గింజలు వేసి బాగా కలపాలి.

ఒక పళ్లానికి అడుగున నెయ్యి రాసి అందులో ఈ మిశ్రమాన్ని పోయాలి.

కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలుగా చాకుతో కోసి ఒక డబ్బాలోదాచుకోవాలి. అంతే పోషకాల చిక్కీ రెడీ అయినట్టే.