మాంసాహారులకు గుడ్‌న్యూస్

శాకాహారం, మాంసాహారాలలో ఏది మంచిది అనే వాదన ఎప్పట్నించో ఉంది.

ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం మాంసాహారాన్ని బలపరిచేలా ఓ విషయాన్ని బయటపెట్టింది.

మాంసాహారం తినేవారిలో డిప్రెషన్ వచ్చే అవకాశాలు చాలా తక్కువట.

శాకాహారులే త్వరగా డిప్రెషన్ బారిన పడతారని చెబుతోంది కొత్త అధ్యయనం.

మాంసాహారంలో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, కోలిన్, విటమిన్ బి6, బి12, ఫోలేట్, కొన్ని ప్రత్యేకమైన అమైనో ఆమ్లాలు, సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ వంటివి లబిస్తాయి.

ఇవి మానసిక స్థితి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా అత్యవసరం.

సెరోటోనిన్, డోపమైన్, నోర్‌ఫైన్‌ఫ్రైన్ టివి మానసిక స్థితిని నియంత్రించే న్యూరో ట్రాన్స్ మీటర్లు.

ఇవన్నీ మాంసాహారంలో పుష్కలంగా దొరుకుతాయి. కాబట్టి వీరు అంత త్వరగా డిప్రెషన్ బారిన పడరు.