భోజనం తర్వాత స్నానం ఎందుకు చేయకూడదు? భోజనం తర్వాత చాలా మంది తమకు తెలియకుండా కొన్ని తప్పులు చేస్తారు. అలా చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. తిన్న వెంటనే స్నానం చెయ్యకూడదు. దానివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. భోజనం చేసిన వెంటనే జీవక్రియకి అవసరమయ్యేలా రక్తం పొట్ట చుట్టూ చేరుతుంది. అటువంటి సమయంలో స్నానం చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత మారిపోతుంది. ఆ ఉష్ణోగ్రత సాధారణ స్థితికి చేరేందుకు టైమ్ పడుతుంది. జీర్ణక్రియ మందగిస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదని చెప్తారు. ఇంకా భోజనం తర్వాత వ్యాయామం, వంగి పనులు చేయడం మానుకోవాలి. పండ్లు తినకూడదు, కాఫీ, మద్యం తాగకూడదు. Images Credit: Pixabay, Pexels and Unsplash