‘లూసిఫర్’ అంటే ఎవరు? రాక్షసుడా, దేవదూత?

‘లూసిఫర్’ పేరు మనం చాలాసార్లు వినే ఉంటాం. కానీ, పెద్దగా పట్టించుకోం.

మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రిలీజ్ తర్వాత ఆ టైటిల్‌కు మంచి క్రేజ్ వచ్చింది.

ఆ ‘లూసిఫర్’ సినిమానే తెలుగులో ‘గాడ్ ఫాదర్’గా తెరకెక్కించారు.

ఇంతకీ ‘లూసిఫర్’ అంటే ఎవరు? రాక్షసుడా, దేవదూత? అతడు ఎలాంటివాడు?

‘లూసిఫర్’ను కొందరు దేవదూతగా, మరికొందరు ‘డెవిల్‌’గా భావిస్తారు.

అర్థమయ్యేలా చెప్పాలంటే ‘లూసిఫర్’ యముడు లాంటివాడు.

యముడు దేవుడే, కానీ అంతా ఆయనకు భయపడతారు. కానీ, యముడు న్యాయానికి కట్టుబడి ఉంటాడు.

పాశ్చాత్య దేశాల్లో ‘లూసిఫర్’ను యముడిలా భావిస్తారు. కానీ, క్రూరమైనవాడిగా అభివర్ణిస్తారు.

పురాణాల ప్రకారం ‘లూసిఫర్’ దేవుడికి దేవదూతగా ఉండేవాడు. దేవుడి స్థానాన్ని పొందేందుకు చూసేవాడు.

ఓసారి తన అనుచరులతో దేవుళ్లను ఎదిరించి, స్వర్గాన్ని స్వాధీనం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు.

కానీ, దేవుళ్లు వారిపై విజయం సాధిస్తారు. ‘లూసిఫర్’ను స్వర్గం నుంచి వెలివేస్తారు.

అప్పుడే లూసిఫర్ నరకాన్ని ఏర్పాటు చేసి.. జనాలను, దేవుళ్లను హింసిస్తూ ‘డెవిల్’గా మారడని చెబుతుంటారు.

Images Credit: Pixabay and Pexels