దసరాకు బాదం పాయసం

బియ్యం - ఒక కప్పు
పెసరపప్పు - ఒక కప్పు
బెల్లం - రెండు కప్పులు
జీడిప్పులు - పది
కిస్ మిస్‌లు - పది

కొబ్బరి ముక్కలు - అరకప్పు
నీళ్లు - తగినన్ని
బాదం పప్పులు - పది
నెయ్యి - అర కప్పు
యాలకుల పొడి - అర స్పూను

కళాయిలో నెయ్యి వేసి కొబ్బరి ముక్కలు , జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పులు వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు బియ్యం, పెసరపప్పు వేసి మెత్తగా కుక్కర్లో ఉడికించుకోవాలి.

ఉడికాక అందులో బెల్లం తురుము, కాస్త నీరు వేసి బాగా కలపాలి.

గరిటెతో మెత్తగా అయ్యేలా కలుపుకుంటే పాయసంలా రెడీ అవుతుంది.

ముందుగా వేయించుకున్న కొబ్బరిముక్కలు, జీడిపప్పులు, కిస్ మిస్‌లు వేసి బాగా కలపాలి.

ఎంతో రుచికరమైన పెసరపప్పు పొంగలి నైవేద్యం రెడీ అయినట్టే.