యాపిల్ గింజలు తింటే అంత ప్రమాదమా? యాపిల్ తింటే డాక్టర్‌తో పని ఉండదని అంటారు. కానీ, యాపిల్ గింజలు తింటే మాత్రం డాక్టర్ దగ్గరకు వెళ్లాల్సిందే. ఎందుకంటే, యాపిల్ గింజలు చాలా ప్రమాదకరమట. యాపిల్ గింజల్లో అమాక్డాలిన్ అనే పదార్థం ఉంటుంది. గింజలను నమిలినప్పుడు ఆ పదార్థం హైడ్రోజన్ సైనైడ్‌గా మారుతుంది. అది రక్తంలో కలిసి శ్వాసకోశ సంబంధ సమస్యలు ఏర్పడతాయి. చిన్నపిల్లల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందట. ఆపిల్ గింజల్లోని హైడ్రోజన్ సైనేడ్ వల్ల శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది. ఎక్కువ మోతాదులో యాపిల్ గింజలు తింటే అది మరింత ప్రమాదకరం. కాబట్టి, ఇకపై యాపిల్ తినేప్పుడు గింజలు తినకండి. గింజలను తొలగించిన యాపిల్ మాత్రమే తినండి. Images Credit: Pixabay and Pexels