గర్భిణులు ఆకుకూరలు తింటే శిశువులు ఏడుస్తారట గర్భిణులపై చేసిన ఒక అధ్యయనం చాలా ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. పుట్టబోయే బిడ్డలు తమ తల్లులు తినే ఆహారం రుచికి ఎలా స్పందిస్తారో పరిశోధకులు కనుగొన్నారు. 4D అల్ట్రాసౌండ్ స్కాన్‌ల ద్వారా వారి తల్లులు తినే ఆహారాన్ని బట్టి గర్భస్థ శిశువులు ఎలా స్పందిస్తున్నారో పరిశీలించారు. తల్లి ఆకుకూరలు తిన్నప్పుడు పిల్లలు ఏడుపు ముఖం పెట్టినట్టు కనిపించింది అల్ట్రా సౌండ్‌లో. క్యారెట్ తిన్నప్పుడు శిశువులు చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. ఆ గర్భస్థ శిశువులుగా వారు ఎక్కువ ఏ రుచికి గురవుతారో, బయటికి వచ్చాక వాటినే ఇష్టపడతారు. గర్భస్థ శిశువులకు భావోద్వేగాలు, ఇష్టయిష్టాలు ఉంటాయని కనిపెట్టారు పరిశోధకులు.