కోడిగుడ్లు - ఎనిమిది అల్లం వెల్లుల్లి పేస్టు - రెండు స్పూన్లు ఆవ నూనె - ఆరు టీస్పూన్లు గరం మసాలా - నాలుగు టీస్పూన్లు కారం - రెండు టీస్పూన్లు
జీలకర్ర - రెండు టీస్పూన్లు ఉప్పు - రుచికి సరిపడా మెంతి పొడి - రెండు స్పూన్లు ఆవ పొడి - రెండు స్పూన్లు కరివేపాకులు - మూడు రెమ్మలు నిమ్మకాయ రసం - రెండు స్పూన్లు
కళాయిలో కాస్త నూనె వేసి ఉడికించిన కోడిగుడ్లకు గాట్లు పెట్టి వేయించాలి.
కోడిగుడ్లు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, గరంమసాలా, ఉప్పు వేసి వేయించాలి.
అన్నీ వేగాక కరివేపాకులు వేసి కలిపి స్టవ్ కట్టేయాలి.
ఈ మొత్తం మిశ్రమాన్ని చల్లార్చాలి. చల్లారాక అందులో ఆవపొడి, మెంతి పొడి వేసి కలపాలి.
చివర్లో నిమ్మరసం పిండి బాగా కలపాలి.
ఇది గ్రేవీలా ఉంటుంది. కాబట్టి వేడి వేడి అన్నంతో తింటే ఆ రుచే వేరు.