వేడినీటిలో తేనె వేసుకుని తాగితే విషమే

తేనె ఆరోగ్యానికి చాలా మంచిది. ఆయుర్వేదంలో దీని పాత్ర ప్రధానమైనది.

తేనెను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే చాలు. ఫ్రిజ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు.

చాలా మంది వేడి నీళ్లలో, వేడి పానీయాల్లో కలుపుకుని తాగుతూ ఉంటారు. వీటివల్ల ప్రయోజనాల కన్నా నష్టాలే ఎక్కువ.

ఆయుర్వేదం ప్రకారం, తేనెను వేడి నీటిలో కలపడం వల్ల అమా వంటి విషపదార్ధాలను విడుదల అవ్వచ్చు.

ఇది దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీర్ణ, శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.

వేడి పానీయాల్లో దీన్ని కలిపితే హైడ్రాక్సీమీథైల్ఫర్‌ఫ్యూరల్ అని పిలిచే టాక్సిన్ ‌విడుదల అవుతుంది. ఇది క్యాన్సర్ కారకంగా మారుతుంది.

చక్కెరకు బదులు తేనెను వాడడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయం. అయితే టీ వేడిగా ఉన్నప్పుడు తేనెను కలపకూడదు.

గోరువెచ్చని నీళ్లలోనే తేనె కలుపుకుని తాగాలి.