మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే ఆనందం, శ్రేయస్సు, అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు కొన్ని ఉన్నాయి. మామిడి పండ్లు తినడం, నైవేద్యంగా ఇవ్వడం లేదా దానం చెయ్యడం వల్ల అదృష్టం పొందవచ్చని నమ్ముతారు. ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులను నెయ్యితో దీపం వెలిగించడం వల్ల దూరమవుతాయంటారు. పనిమీద వెళ్లినప్పుడు కొన్ని లవంగాలు జేబుతో పెట్టుకుని వెళితే సక్సెస్ అవుతారట. దాల్చిన చెక్కని పర్సులో పెట్టుకుంటే అనవసరమైన ఖర్చులు తగ్గుతాయిట. ఎర్రమిరపకాయలతో దిష్టి తీసుకుని వెళితే అరిష్టం పోతుంది. చేపలు బహుమతిగా ఇచ్చిపుచ్చుకుంటే వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కందులు తినడం, దానం చేయడం వల్ల అదృష్టం, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని అంటారు.