ఈ పండ్లను అస్సలు కలిపి తినొద్దు, అతిగా అస్సలు వద్దు!

ఈ మధ్య ఫ్రూట్ సలాడ్స్‌ను డైట్‌గా తీసుకొనేవారు ఎక్కువయ్యారు.

ఫ్రూట్స్ మంచివే కానీ, అతిగా తిన్నా, కొన్ని రకాల పండ్లు కలిపి తిన్నా ప్రమాదమే.

పుచ్చకాయలు, కర్బుజాలు, సీతాఫలాలను ఇతర ఫ్రూట్స్‌తో కూడా కలిపితినొద్దు.

అరటిపండ్లు, ఎండుద్రాక్ష వంటి తీపి పండ్లతో యాపిల్స్, దానిమ్మ, పీచెస్ కలిపి తినొద్దు.

అరటి పండ్లను జామ కాయలతో కలిపి తినొద్దు. కాయగూరలను పండ్లతో కలిపి అస్సలు తీసుకోవద్దు.

మొక్క జొన్న, ఆలుగడ్డలు, బఠానీలు కలిపి తినొద్దు. వీటిలో ఉండే హైప్రోటీన్స్ వల్ల సమస్యలు వస్తాయి.

అవన్నీ కలిపి తిన్నట్లయితే జీర్ణ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

పండ్లను మోతాదుకు మించి అతిగా తిన్నా మంచిది కాదు.

పండ్లను అతిగా తింటే కడుపులో అసౌకర్యం, విరేచనాలు, ఉబ్బరం, గుండెల్లో మంట ఏర్పడతాయి.

ఆహారంలో ఇతర పోషకాల స్థానంలో పండ్లను తీసుకుంటే పోషకాహార లోపానికి గురికావచ్చు.

కాబట్టి, ఇకపై పండ్లను డైట్‌గా తీసుకొనేప్పుడు జాగ్రత్తగా ఉండండి.

Images Credit: Pexels, Pixabay and Unsplash