ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార పువ్వు మాంసాహార మొక్కలు, పువ్వులు ప్రపంచంలో ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి మొక్కల్లో రాఫెల్సియకా ఆర్నాల్డీ ఒకటి. దీన్ని మొక్క అనడానికి లేదు, నేలపైనే పూసే పెద్ద పువ్వు. దీన్ని ఆంగ్లంలో ‘Corpse Flower’ అని అంటారు. దానికి కారణం ఇది కుళ్లిన మాంసం వాసన వస్తుంది. ఈ పువ్వు దగ్గరికి వెళితే ముక్కు మూసుకోవాల్సిందే. ఇది ఎక్కువగా ఇండోనేషియాలో కనిపిస్తుంది. సుమత్రా, బోర్నియో దీవుల్లో వికసిస్తుంది. ఇండోనేషియా మూడు జాతీయ పుష్పాలలో రాఫ్లేసియా ఆర్నాల్డి ఒకటి. ఈ పువ్వు 11 కిలోల బరువు తూగుతుంది. మూడు అడుగుల వ్యాసంతో పూస్తాయి.