నిద్ర పట్టేలా చేసే చెర్రీ జ్యూస్ ఒత్తిడి,ఆధునిక జీవితంలో ఉన్న ఒడిదుడుకుల కారణంగా నిద్రలేమి సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. చెర్రీ పండ్లను కేవలం కేకులపై వేసుకుని చల్లుకుని తినడానికే ఉపయోగిస్తారు. చెర్రీపండ్లు నిద్రా సమస్యలను తగ్గించడంలో ఎలా సహాయపడతాయో నిపుణులు వివరిస్తున్నారు. మన శరీరంలోని పీనియల్ గ్రంధి నిద్రాహార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ హార్మోన్ నిద్రా చక్రాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ హార్మోనును అధికంగా ఉత్పత్తి అయ్యేలా చేయడంలో చెర్రీపండ్లు మేలు చేస్తాయి. రాత్రి పడుకోవడానికి అరగంట లేదా గంట ముందు చెర్రీ పండ్లను తినాలి. లేదా జ్యూస్ రూపంలో తీసుకోవాలి. రక్తాన్ని పలుచన చేసే మందులను తీసుకునే వారు మాత్రం చెర్రీ పండ్లను తినే ముందు వైద్యుడిని సంప్రదించాలి.