తొలిరాత్రి పాలు తాగడం వెనుక పరమార్థం ఇదే పెళ్లయిన మొదటిరాత్రి కుంకుమ రేకలు కలిపిన పాలు తాగడం వెనుక చాలా బలమైన కారణమే ఉంది. పాలు బలవర్ధకమైన ఆహారం అని అందరికీ తెలుసు. అందులో కుంకుమపూలు వేయడం వల్ల ఆ రెండూ కలిపి మరింత శక్తిని ఇస్తాయి. ఇక కుంకుమ రేకలు కామోద్దీపనను కలిగిస్తాయి. పాలల్లో ఉండే ట్రిప్టోఫాన్‌తో కుంకుమ రేకలు కలిసి జీవశక్తి మెరుగుపడుతుంది. ఇది కొత్తగా పెళ్లయిన జంటలో ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. శాస్త్రీయంగా, కుంకుమపువ్వు గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉందని చాలా అధ్యయనాలు చెప్పాయి. ఇది మానసిక స్థితిని మెరుగుపరచడానికి, మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో మేలు చేస్తుంది. కామసూత్రలో పాలు - కుంకుమ పూలు కలిపిన మిశ్రమం తాగడం ప్రస్తావన ఉంది.