వావ్, వేరు శనగలు తింటే ఇన్ని ప్రయోజనాలా! బయట జోరుగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ.. వేరు శనగలు తినడం భలే బాగుంటుంది కదూ. తలచుకుంటేనే నోరూరిపోతుందా? అయితే, వాటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరేమో. వేరు శనగల్లోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహకరిస్తుంది. వేరు శనగల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పోషకాలు మీ శరీరానికి శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. వ్యాధుల నుంచి రక్షిస్తాయి. ఇందులోని మంచి కొవ్వులు గుండెకు మేలు చేస్తాయి. పల్లీలు రక్తపోటు సమస్యనూ తీరుస్తాయి. వేరు శెనగలో ఉండే యాంటీఆక్సిడెంట్, అమైనో యాసిడ్‌లు రక్త నాళాలకు మేలు చేస్తాయి. వేరుశెనగలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది, ఇది ఇన్సులిన్ ప్రసరణను యాక్టీవ్ చేస్తుంది. ఇన్సులిన్ ప్రసరణ సక్రమంగా ఉంటే డయాబెటిస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరు శనగల్లోని ప్రొటీన్, విటమిన్-E.. క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. రోజుకు 40 గ్రాముల వేరు శనగలు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే ముప్పే. రోజుకు 40 గ్రాముల వేరు శనగలు మాత్రమే తినాలి. అంతకంటే ఎక్కువ తింటే ముప్పే. Images Credit: Pixabay, Pexels and Unsplash