బరువు తగ్గించే మాత్ర, వ్యాయమంతో పనే ఉండదిక! ఒళ్లు కదల్చకుండా బరువు తగ్గాలని ఎవరికి ఉండదు చెప్పండి. పైగా, ఈ రోజుల్లో వ్యాయామం చేయడానికి టైమ్ కూడా ఉండటం లేదు. అందుకే, పరిశోధకులు ప్రత్యేకంగా ఓ పిల్‌ను తయారు చేస్తున్నారు. ఈ ఒక్క మాత్రతో అరగంట వ్యాయమం చేసినంత ప్రభావం కలుగుతుందట. శరీరంలో కలిగే ఆ వ్యాయామ ప్రభావం వల్ల కదలకుండానే కొవ్వు కరిగిపోతుందట. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (MIT) శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు. మానవ శరీరంలోని కణాలను రివర్స్ చేసే జన్యు కోడ్‌ను శాస్త్రవేత్తలు ఛేదించారు. కొవ్వును నిల్వ ఉంచే మెసెన్చైమల్ మూలకణాలపై ఆ మాత్ర ఒత్తిడి తెస్తుంది. ఈ ప్రక్రియ సాధారణంగా వ్యాయమం చేసే సమయంలో జరుగుతుంది. అయితే, ఈ మాత్రను పూర్తి స్థాయిలో అందుబాటులోకి మరికొన్ని పరిశోధనలు చేస్తే చాలట. అంటే, త్వరలోనే కొవ్వును కరిగించే ఆ మాత్రలు వచ్చేస్తాయన్నమాట. ఊబకాయంతో బాధపడుతున్నవారికి ఇది తప్పకుండా గుడ్ న్యూసే. Images Credit: Pixabay