ఉరుములు, మెరుపుల సమయంలో స్నానం ఎందుకు చేయకూడదు?

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు ఏ స్థాయిలో కురుస్తున్నాయో తెలిసిందే.

ఈ వర్షాలకు ఉరుములు, మెరుపులు తోడైతే మరింత డేంజర్.

ఎందుకంటే, మెరుపులతో వచ్చే పిడుగులు ప్రాణాలు తీస్తాయి.

అది సరే, ఉరుములు - మెరుపుల సమయంలో స్నానం ఎందుకు చేయకూడదు?

ఉరిమే సమయంలో నీటికి పూర్తిగా దూరంగా ఉండాలట.

స్నానం చేయడం, పాత్రలు కడకటం, చేతులు నీటితో శుభ్రం చేయడం చేయకూడదు.

ఎందుకంటే, ప్లంబింగ్ ద్వారా కూడా మెరుపులు ప్రయాణిస్తాయి.

కాబట్టి, ఆ సమయంలో స్నానం, ఫేస్‌వాష్‌‌కు దూరంగా ఉండటం మంచిది.

ఆ సమయంలో ఇంటి బాల్కనీ, కిటికీ, తలుపుల దగ్గర కూడా ఉండకూడదు.

ఉరుముల సమయంలో కాంక్రీట్ గోడలకు కూడా అంటుకుని ఉండకూడదు.

ఎలక్ట్రానిక్ పరికరాలకు సైతం దూరంగా ఉండాలి.

Images and Videos Credit: Pexels and Pixabay