క్రిస్పీ క్రిస్పీగా రొయ్యల పకోడీ రెసిపీ




రొయ్యలు - అరకిలో
కారం - ఒక టీస్పూను
బియ్యం పిండి - రెండు స్పూన్లు
పసుపు - అరస్పూను
సెనగపిండి - పావు కప్పు
కరివేపాకు - రెండు రెమ్మలు
ఉప్పు రుచికి సరిపడా
నూనె - సరిపడా
కార్న్‌ఫ్లోర్ - రెండు స్పూన్లు

రొయ్యలు శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి.

ఒక గిన్నెలో సెనగపిండి, బియ్యం పిండి, కారం, పసుపు, ఉప్పు కార్న్ ఫ్లోర్, కాస్త నీరు వేసి బాగా కలపాలి.

ఆ పిండిలో రొయ్యలు వేసి బాగా కలపాలి. కరివేపాకులు కూడా వేయాలి.

స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి వేడి చేయాలి.

నూనె బాగా వేడెక్కాక పిండిని పకోడీల్లా వేసుకోవాలి.

బంగారు వర్ణంలోకి రొయ్యల పకోడీ వేగాక తీసి ప్లేటులో వేసుకోవాలి.

ఇవి క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి.