ఉల్లిపాయ తొక్కల పొడితో ఎన్ని లాభాలో

ఉల్లిపాయలు తొక్కల ఉపయోగాలు చాలా తక్కువ మందికి తెలుసు.

ఇగురు కూరలు వండేటప్పుడు ఉల్లిపాయల తొక్కల పొడి వేస్తే గ్రేవీ చిక్కగా వస్తుంది.

ఉల్లిపాయల తొక్కలతో టీ చేసుకుని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

ఉల్లిపాయ తొక్కల పొడి నీటిలో కలుపుకుని తాగితే కండరాల తిమ్మిరి తగ్గుతాయి.

అన్నం వండేటప్పుడు ఉల్లిపాయ తొక్కలను జోడించడం వల్ల అనేక ఆరోగ్య లాభాలు కలుగుతాయి.

చపాతీ పిండి కలిపేటప్పుడు ఉల్లిపాయ తొక్కల పొడిని కాస్త కలిపితే కొత్త రుచి వస్తుంది.

కర్రీతో ఆ చపాతీని తింటుంటే మంచి రుచి కూడా వస్తుంది.