వామ్మో.. సూరత్ బీచ్, నల్ల ఇసుక - తెల్ల దెయ్యాలు, రాత్రయితే రచ్చే! మీకు బీచ్ అంటే ఇష్టమా? అయితే, సూరత్ బీచ్‌కు వెళ్లండి.. థ్రిల్లే థ్రిల్. ఎందుకంటే.. అక్కడ దెయ్యాలు తిరుగుతాయనే ప్రచారం ఉంది. గుజరాత్‌లో సూరత్ సమీపంలో గల డుమాస్ బీచ్‌కు రాత్రిళ్లు వెళ్లాలంటే స్థానికులు భయపడిపోతారు. ఆ బీచ్‌లో దెయ్యాలు తిరుగుతున్నాయనే ప్రచారం ఉంది. అందుకే ఈ బీచ్‌ను హాంటెడ్ బీచ్ అంటారు. ఈ బీచ్ రెండు విధాలుగా ప్రసిద్ధి. ఒకటి అక్కడి నల్ల ఇసుక, ఇంకొకటి తెల్లని ఆత్మలు. డుమాస్ బీచ్‌ను ఒకప్పుడు హిందువుల శ్మశానవాటికగా ఉపయోగించేవారట. అందుకే ఈ ప్రాంతంలో అనేక ఆత్మలు కనిపిస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. శవాలను కాల్చడం వల్లే అక్కడి ఇసుక నల్లగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎవరో నవ్వుతున్నట్లు, ఏడుస్తున్నట్లు శబ్దాలు వస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. సముద్ర తీరంలో పలువురి అనుమానస్పద మరణాలు కూడా ఈ బీచ్‌కు ఆ పేరు తెచ్చాయి. పలు భయానక పరిస్థితుల వల్ల సాయంత్రం 6 తర్వాత ఇక్కడికి ఎవరినీ అనుమతించరు. ఈ బీచ్‌లో ఏవో తెల్లని గోళాలు గాల్లో కదులుతున్నట్లు చూశామని పర్యటకులు చెబుతుంటారు. Images, Videos Credit: Pexels, Pixabay and Unsplash