బొగ్గుతో అందం? ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి మంచిదేనా? ఎవరైనా సరే ఫేస్ మిలమిలా మెరిసిపోవాలని అనుకుంటారు. మరి, బొగ్గు రాస్తే? అదేంటీ బొగ్గును ముఖానికి రాసుకోవడమా ఇంకేమైనా ఉందా అనేగా సందేహం. బొగ్గును ముఖానికి రాసుకుంటే కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఈ రోజే మొదలుపెడతారు. బొగ్గును నేరుగా ముఖానికి రాయకూడదు. మార్కెట్లో యాక్టివేటెడ్ చార్‌కోల్ ఫేషియల్స్ లభిస్తాయి. జిడ్డు సమస్యతో సతమతం అయ్యేవారు చార్‌కోల్‌ను ముఖానికి రాసుకోవచ్చు. చార్‌కోల్ మొటిమలు, ముఖంపై రంథ్రాలను నయం చేస్తుంది. మృత చర్మ కణాలను తొలగిస్తుంది. బొగ్గు మాస్కు తక్కువ సెబమ్ ఉత్పత్తికి సహకరించడం వల్ల చర్మం నుంచి మలినాలు తొలగిపోతాయి. బొగ్గు ట్యాక్సిన్స్, బ్యాక్టీరియాను పీల్చుకోడానికి అయస్కాంతంలా పనిచేస్తుంది. చార్‌కోల్‌లో యాంటీ ఫంగల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తాయి. అయితే, మీ ముఖానికి బొగ్గు పడుతుందో లేదో తెలుసుకోవాలి. అలర్జీలు ఉంటే డాక్టర్ సలహా తీసుకోవాలి. Images Credit: Pexels