స్పైసీ ఫుడ్ తినాలని ఎందుకనిపిస్తుంది? కారం, మసాలా ఘాటు అధికంగా ఉండే ఆహారాన్నే స్పైసీ ఫుడ్ అంటారు. కొందరికి రోజూ ఆ ఆహారాన్నే తినలనిపిస్తుంది. స్పైసీ ఫుడ్ తప్ప మరేం తిన్నా రుచించదు. స్పైసీ పుడ్ అతిగా తినాలనిపించడం వెనుక కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా దాక్కున్నాయి. గర్భం ధరించిన మహిళల్లో కారం, మసాలా ఘాటు తగిలే ఆహారాన్ని తినాలన్న కోరిక పెరిగిపోతుంది. స్పైసీ ఫుడ్‌లో క్యాప్సైసిన్ ఉంటుంది.ఇది తింటే శరీరంలో వెచ్చగా అనిపిస్తుంది. శరీరం వెచ్చదనం కోరుకున్నప్పుడు స్పైసీ ఫుడ్ తినాలనిపిస్తుంది. డిప్రెషన్‌కు గురైనప్పుడు కూడా వారు కారంగా ఉండే ఆహారాన్ని కోరుకుంటారు. ముక్కు కారుతూ, తుమ్ములు వస్తున్నప్పుడు కూడా కారం నిండిన ఆహారాన్ని తినాలనిపిస్తుంది. తరచుగా స్పైసీ ఫుడ్ తినడం వల్ల అజీర్ణం, అసిడిటీ, కడుపు మంట, గుండె మంట ఇలా చాలా సమస్యలు రావచ్చు. అందుకే ఎక్కువ తినకూడదు.