నిద్ర నుంచి లేవగానే ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. అలా ఎందుకు జరుగుతుందో చాలామందికి తెలీదు.

అతిగా వ్యాయామం చేయడం లేదా బరువులు ఎత్తడం వల్ల కొందరికి ఇలా జరుగుతుంది.

అలాగే, ఇష్టమైన భంగిమలో నిద్రపోయినప్పుడు కూడా కండరాలు పట్టేస్తాయి. నిద్రలేచేప్పుడు నొప్పి కలిగిస్తాయి.

పొట్ట మీద బోర్లా పడుకోవడం వల్ల కూడా ఈ నొప్పులకు కారణమని పరిశోధకులు తెలుపుతున్నారు.

బోర్లో పడుకోవడం వల్ల మెడ, నడుము నొప్పులు ఎక్కువగా వస్తాయట.

మీరు నిద్రపోయే మంచం, పడక సక్రమంగా లేకపోయినా సరే మీకు ఒళ్లు నొప్పులు రావచ్చు.

మీరు ఎక్కువ బరువు ఉన్నా సరే.. నిద్రలేచేప్పుడు ఒళ్లు నొప్పులు రావచ్చు.

అలాగే కొన్ని వైరల్ ఫీవర్స్, మెడికల్ కండీషన్స్ వల్ల నిద్ర నుంచి లేచినప్పుడు ఒళ్లు నొప్పులు రావచ్చు.

Images Credit: Pexels