కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే.. ఈ చిట్కాలు తప్పకుండా పాటించాల్సిందే. అవేమిటో చూసేయండి.

ఆహారంలో విటమిన్లు సి, ఏ, ఈ తోపాటు జింక్, సెలినియం వంటి పోషకాలు ఉండేట్టు చూసుకోవాలి.

పోషకాహారం తీసుకుంటే వయసు ప్రభావంతో వచ్చు మాక్యూలార్ డీజెనరేషన్ వంటి సమస్యలు రావు.

ఎండ నుంచి కళ్లను కాపాడుకునేందుకు తప్పనిసరిగా సన్ గ్లాసెస్ ధరించాలి.

లాబోరేటరీలు, కన్ స్ట్రక్షన్ పనుల్లో ఉండేవారు తప్పకుండా సేఫ్టీ గ్లాసెస్ ధరించాలి.

డిజిటల్ డివైజ్ లు వాడుతున్నపుడు తప్పకుండా 20-20 నియమాన్ని పాటించాలి.

ప్రతి 20 నిమిషాలకు ఒక ఇరవై సెకండ్ల విరామాన్ని తప్పకుండా తీసుకోవాలి.

20 అడుగుల దూరంలో ఉన్న వస్తువుల మీద దృష్టి నిలపాలి.

పొగతాగడం వల్ల క్యాటరాక్ట్, మాక్యులార్ డీజెనరేషన్ వంటి సమస్యలు వస్తాయి కనుక తప్పకుండా పొగతాగడం మానెయ్యాలి.

డయాబెటిస్, బీపీ వంటి సమస్యలను అదుపులో లేకపోతే రెటినోపతి వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.

కంటి ఆరోగ్యం కోసం కూడా తగినంత నీళ్లు తాగడం అవసరం. డీహైడ్రేషన్ కూడా కంటి చూపుకు హాని చేస్తుంది.

తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఏడాదికి ఒకసారి పరీక్షలు చేయించుకుంటే చూపులో తేడాలను త్వరగా గుర్తించవచ్చు.

Representational Image : Pexels