మనసు బాలేకపోతే మద్యం జోలికి పోకండి. పరిస్థితి మరింత దిగజారవచ్చు. ఆల్కహాల్ కూడా డిప్రెసెంట్ గా పనిచేస్తుంది.

డిప్రెషన్ మందులు వాడుతుంటే కొన్ని రకాల యాంటీ డిప్రెసెంట్స్ మీద ఆల్కహాల్ వ్యతిరేక ప్రభావం చూపుతుంది.

ఆందోళనలోనూ తాగొద్దు. ఎందుకంటే ఆల్కహాల్ డిప్రెషన్ పెంచుతుంది.

దీర్ఘకాలికంగా మద్యం సేవిస్తున్నవారిలో మెదడు దెబ్బతిని డిమెన్షియా, ఆల్జీమర్స్ కు కారణం కావచ్చు.

కొన్ని రకాల మద్యంతో తాత్కాలికంగా రిలాక్సింగ్ గా అనిపించవచ్చు. ఇవి దీర్ఘకాలంలో సమస్యను మరింత దిగజారుస్తాయి.

డిమెన్షియా వంటి కేంద్ర నాడీ వ్యవస్థకు చెందిన సమస్యలు ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లో మద్యం తీసుకోకూడదు.

బీపీ, షుగర్, కిడ్నీ సమస్యలు, వర్కవుట్ లేకపోవడం, స్థూలకాయం వంటి సమస్యలున్న వారు కూడా మద్యం జోలికి పోవద్దు

ఆల్కహాల్ ఎక్కువగా తీసుకునే వారిలో బీపీ అసాధారణంగా పెరిగిపోయి ప్రాణాపయ స్థితి ఏర్పడే ప్రమాదం ఉంటుంది.

మద్యం వల్ల రక్తంలో కాల్షియం, కార్టిసాల్ పెరిగిపోయి జీవక్రియలు ప్రభావితం అవుతాయి.
Representational Image : Pexel