కోడి గుడ్డు పర్ఫెక్ట్ గా ఉడికించడం చాలా మందికి రాదు.

ఉడుకుతున్న గుడ్లు మధ్యలోనే పగుళ్లు రావడం, లేదా సొన బయటకు రావడం వంటి సమస్యలు వస్తుంటాయి.

గుడ్డు పర్ఫెక్ట్ ఆకారంలో ఉండే గుడ్డు ఉడికించేందుకు కొన్ని టిప్స్ చూద్దాం.

ఫ్రిజ్ లో నుంచి తీసిన వెంటనే కోడిగుడ్డును వేడినీటిలో వేసి ఉడికించడం వల్ల గుడ్డులో తీవ్రమైన రియాక్షన్స్ జరుగుతాయట

చల్లని గుడ్డును వెంటనే వేడి నీళ్లలో వెయ్యడం వల్ల గుడ్డులోని తెల్ల సొన పెంకుకు అంటుకుంటుంది. పొట్టు ఒలవడం కష్టం అవుతుంది.

ఫ్రిజ్ నుంచి తీసిన గుడ్లు గది ఉష్ణోగ్రతకు వచ్చే వరకు ఆగడం మంచిది.

ఇలా గది ఉష్ణోగ్రతలో ఉన్న గుడ్లు ఉడికించినపుడు తొక్క సులభంగా వలవడానికి వీలవడం మాత్రమేకాదు అవి పగుళ్లు కూడా చూపవు.

ముందుగా నీళ్లు మరిగించుకొని తర్వాత వాటిలో గుడ్లను ఉడికించుకోవాలి.

Representational Image : Pexels