చలికాలం అనగానే జుట్టు రాలుతుందని బెంగపడుతుంటారు చాలా మంది.

ప్రతి రోజూ 5-7 కరివేపాకులను తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. జుట్టు రాలడం తగ్గుతుంది.

ఒక కప్పు నీటిలో 5-7 కరివేప ఆకులను వేసి మరిగించి వడకట్టి ఆ నీటిని తాగితే మంచి ఫలితం ఉంటుంది.

వేపకు నీటిలో వేసి కాచి ఆ నీటితో తలంటుకుంటే జుట్టు రాలదు, చుండ్రు సమస్య నుంచి విముక్తి దొరకుతుంది.

చలి కాలంలో వంటకు నువ్వుల నూనె ఉపయోగించడం మంచిది. దీనిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలం.

నేరుగా రోజూ ఒక స్పూన్ నువ్వుల నూనె తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. కీళ్లు, జుట్టు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

టీ స్పూన్ నువ్వులను వేయించి, భోజనం తర్వాత లేదా స్నాక్ టైమ్ లోనూ తీసుకోవచ్చు.

ఒక టీ స్పూన్ నువ్వులు రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్నే మొదట ఇవి తినాలి.

లేదా నవ్వుల లడ్డుగా కూడా తినొచ్చు. వీటి తయారీకి చక్కెర బదులు, బెల్లం వాడడం శ్రేయస్కరం.

నాసికా రంధ్రంలో రెండు చుక్కల ఆవునెయ్యి వేస్తే జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

గోరువెచ్చగా ద్రవరూపంలో ఉండే ఆవునెయ్యిని రెండు చుక్కలు చేతి వేళ్లను ఉపయోగించి వేసుకోవాలి.

Representational Image : Pexels and Pixabay