ఒకొక్కరూ ఒక్కో భంగిమలో నిద్రపోతారు. ఆ పొజిషన్‌లో పడుకుంటేనే వారికి నిద్ర బాగా పడుతుంది.

అయితే, మనం పడుకొనే పొజీషన్.. మన వెన్నుపూసపై కూడా ప్రభావం చూపుతుంది.

కాబట్టి, ఈ బెస్ట్ పొజీషన్స్‌లో నిద్రపోవడానికి ట్రై చెయ్యండి.

పక్కకు తిరిగి పడుకోవడం చాలా మంచి పొజిషన్. మెడ, వెన్నుముకకు మేలు చేస్తుంది.

గుండెలో మంట, గురక సమస్యలతో బాధపడేవారు పక్కకు తిరిగి నిద్రపోవడమే బెటర్.

నడుం నొప్పితో బాధపడేవారు మోకాళ్ల మధ్యలతో తలగడ పెట్టుకుని పక్కకు తిరిగి నిద్రపోవడం మంచిది.

అయితే చాలామందిలో ఏ వైపుకు తిరిగి పడుకుంటే బెటర్ అనే సందేహం ఉంటుంది.

ఎడమ వైపు తిరిగి పడుకోవడమే మంచిదట. కుడివైపు తిరిగి పడుకుంటే అంతర్గత అవయవాలు ఒత్తిడికి గురవ్వుతాయి.

వెల్లకిలా పడుకోవడం అన్నింటికంటే బెస్ట్ పొజీషన్. మంచిగా శ్వాస ఆడుతుంది. నడుముకు కూడా మంచిది.

బోర్లో.. పొట్ట మీద పడుకోవడం కూడా మంచిదే. దానివల్ల గురక సమస్య ఉండదు. కానీ, ఊపిరి పీల్చుకోవడం కష్టం.

Images Credit: Pexels