ప్రతి రోజూ పసుపును కొద్ది మొత్తంలో ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.

పసుపులో ఉండే కర్కుమిన్ మంచి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది.

గుండెజబ్బులు, క్యాన్సర్, ఆర్థరైటిస్ సహా చాలా సమస్యల నివారణలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.

కర్కుమిన్ మంచి యాంటీఆక్సిడెంట్ కూడా. ఆక్సిడేషన్ వల్ల శరీరానికి కలిగే నష్టాన్ని నిరోధిస్తుంది.

ఆర్థరైటిస్ తో బాధపడుతున్న వారిలో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. పసుపు వల్ల జీవన నాణ్యత మెరుగవుతుంది.

రక్తనాళాల ఎండోథీలియం పనితీరు మెరుగవుతుంది. కర్కుమిన్ గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

కడుపునొప్పి, అజీర్తి, ఐబిస్ లక్షణాలను తగ్గిస్తుంది.

చాలా రకాల జీర్ణసమస్యలకు పసుపు మంచి ఔషధం.
Representational Image : Pexels