ఈ మధ్య నోషుగర్ డైట్ చాలా ప్రాచూర్యంలో ఉంది. ఈ డైట్ లో ఉన్నపుడు ఏం తినాలో ఏం తినకూడదో తెలుసుకుందాం.

బరువు తగ్గాలనుకునే వారికి కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

అయితే చక్కెరలు పూర్తిగా మానేస్తే పోషకాహార లోపాలు ఏర్పడవచ్చట.

నో షుగర్ డైట్ లో ఉన్న వారు తప్పకుండా పండ్లు కూరగాయలు ఎక్కువ వినియోగిస్తే వీటి ద్వారా అందే చక్కెర వల్ల లోపం ఏర్పడదు.

సోడా, పండ్ల రసాలు, ఎనర్జీ డ్రింక్స్ పూర్తిగా మానెయ్యాలి. టీ, కాఫీలు చక్కెర లేకుండా తాగాలి.

స్వీట్లు, కుకీలు, కేకులు, పేస్ట్రీలు, ఐస్ క్రీమ్ ఇతర తియ్యని పదార్థాలన్నింటికి దూరంగా ఉండాలి.

తియ్యగా తినాలని అనుకుంటే సహజమైన చక్కెరలు తీసుకోవచ్చు .

సలాడ్ డ్రెసింగ్ లతో సహా అన్ని రకాల ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలి.

వైట్ బ్రెడ్, వైట్ రైస్, రిఫైన్డ్ గింజలు వీటన్నింటిలోనూ చక్కెరలు అధికంగా ఉంటాయి. కనుక వీటిని కూడా తినకూడదు

బేకన్ వంటి ప్రాసెస్డ్ మాంసాహారం కూడా తీసుకోవద్దు. వీటిలో ఆడెడ్ షుగర్స్ ఉండొచ్చు

పండ్ల రసాలకు బదులుగా మొత్తం పండు తినడం మంచి ఫలితాలను ఇస్తుంది.

మార్కెట్ లో దొరికే అన్ని రకాల బ్రెక్ ఫాస్ట్ సీరియల్స్ లో కూడా ఆడెడ్ షుగర్స్ ఉంటాయి ఇవి కూడా తినకూడదు.



Representational Image : Pexels