పాలతో ఇలా చేస్తే జుట్టు సమస్యలు దూరం



పాలు తాగడం వల్లే కాదు, పాలతో కొన్ని చిట్కాలు పాటించడం వల్ల కూడా జుట్టును కాపాడుకోవచ్చు.



జుట్టు పొడి బారడం, జుట్టు చివర్లు చిట్లడం వంటి సమస్యలు ఉంటే ఇలా చేయండి.



పాలు తాగినా లేదా పాలను జుట్టుకు అప్లయ్ చేసినా జుట్టు బలంగా మారుతుంది.



పాలల్లో బయోటిన్ ఉంటుంది. ఇది పొడి జుట్టుకు రాయడం వల్ల అవి పట్టులా మెరుపును పొందుతాయి.



పాలల్లో ఓట్స్ వేసి పేస్తులా చేసి, ఆ మిశ్రమంతో మాడును రుద్దుకోవాలి. ఇలా చేయడం వల్ల మురికిపోయి జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది.



వారానికి కనీసం రెండుసార్లయినా జుట్టుకు పాలను అప్లై చేయడం వల్ల జుట్టు అందంగా పెరుగుతుంది.



జుట్టు ఒత్తుగా పెరగడానికి ప్రొటీన్, కాల్షియం అవసరం. ఈ రెండూ పాలల్లో ఉన్నాయి.



హెయిర్ మాస్కుల్లో పాలను కూడా కలిపి జుట్టుకు రాసుకోవడం అలవాటుగా మార్చుకోండి.