నిద్ర పట్టక పోవడానికి కొన్ని సాధారణ విషయాలు కూడా కారణం కావచ్చు. కాస్త ఒత్తిడి మోతాదు పెరిగితే కార్టిసాల్ విడుదల ఎక్కువవుతుంది. ఫలితంగా చురుకుదనం పెరిగి నిద్రపట్టదు మితిమీరిన ఆలోచనలు, ఒత్తిడి, ఆందోళన వల్ల రాత్రి నిద్రకు దూరం అవుతారు. గట్ బ్యాక్టీరియా ఇంబాలెన్స్ వల్ల కూడా నిద్రపట్టదు. కార్టిసాల్ ప్రభావం గట్ బ్యాక్టీరియా మీద కూడా ఉంటుంది. గట్ బ్యాక్టీరియా ఇంబాలెన్స్ వల్ల ట్రిప్టోఫాన్ ను విడగొట్టేందుకు ఇబ్బంది ఏర్పడుతుంది. అందుకే నిద్ర పట్టదు. ప్రొబయాటిక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల ఈ సమస్య కు పరిష్కారం చూపవచ్చు. నిద్ర సమయానికి రక్తంలో షుగర్ స్థాయి పడిపోతే నిద్ర పట్టకపోవచ్చు. నిద్ర సమయానికి రక్తంలో షుగర్ స్థాయి పడిపోతే నిద్ర పట్టకపోవచ్చు. సమతుల ఆహారం తీసుకుంటే రక్తం లో గ్లూకోజ్ స్థాయిని బ్యాలెన్స్ చెయ్యవచ్చు. ఫలితంగా నిద్ర సమస్య రాదు. నిద్రా సమయానికి గంటలోపు తీసుకునే వైన్ కూడా నిద్రకు భంగం కలిగించవచ్చు. నికోటిన్ వినియోగం కూడా నిద్రమీద ప్రభావం చూపుతుంది. కనుక రాత్రి పూట పొగతాగకూడదు. నిద్రకు కనీసం 6 గంటల ముందు నుంచి కాఫీ, టీలకు దూరంగా ఉండాలి. విటమిన్-D లోపం ఏర్పడితే మెలటోనిన్ హార్మోన్ ఉత్పత్తిలో సమస్యలు రావచ్చు. ఇది నిద్రను నియంత్రించే హార్మోన్. Representational image:Pexels