మాంసాహారం తగ్గిస్తే గుండె సేఫ్ మన జనాభాలో నాన్ వెజ్ ప్రియులు ఎక్కువ. ప్రతిరోజూ ముక్క లేనిదే ముద్ద దిగని వారెందరో. మాంసాహారాన్ని అధికంగా తింటే గుండె జబ్బులు వచ్చే అవకాశం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మాంసాహారం తినడం వల్ల రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే సమస్య పెరుగుతుంది. దీనివల్ల రక్తసరఫరాకు అంతరాయం కలుగుతుంది. ఇలాంటి సమస్యల వల్ల గుండె పోటు వంటివి వచ్చే అవకాశం ఉంది. మాంసాహారాన్ని తగ్గించుకోవడం ద్వారా గుండెను కాపాడుకోవచ్చు. మాంసాహారాన్ని వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తినాలి. ప్రతిరోజూ తినడం మానుకోవాలి. మాంసాహారం తినేవారిలో దీర్ఘకాలిక వ్యాధులతో ముడిపడి ఉంది. వాటి బారిన పడకుండా ఉండాలంటే మాంసాహారాన్ని తగ్గించాలి. మాంసాహారాన్ని తగ్గించుకుని పండ్లు, కూరగాయలు, నట్స్ వంటివి అధికంగా తినాలి.