కాల్చిన మొక్కజొన్న vs ఉడికించిన మొక్కజొన్న, ఏది బెటర్



ఉడికించిన లేదా కాల్చిన మొక్కజొన్నపై కాస్త ఉప్పు, కారం రాసుకొని తింటే ఆ మజాయే వేరు.



ఎంతో మందిలో ఉన్న సందేహం మొక్కజొన్నను కాల్చి తింటే ఆరోగ్యకరమా లేక ఉడికించి తింటే ఆరోగ్యకరమా అని.



మొక్కజొన్నను నీళ్లలో ఉడికించి తింటేనే ఎక్కువ ఆరోగ్యకరం.



కాల్చిన మొక్కజొన్నలు తినడం వల్ల మొక్కజొన్న గింజల్లో కొన్ని నల్లగా పైపైన మాడిపోతాయి.



ఇలా నల్లగా మాడిన ఆహారాన్ని తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.



కాల్చిన మొక్కజొన్న కంటే ఉడికించిన మొక్కజొన్న తినడమే ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిది. అలాగే వాటిపై పచ్చి ఉప్పు, కారాన్ని రాసుకోవడం తగ్గించండి.



పచ్చి ఉప్పు వల్ల అధిక రక్తపోటు బారిన త్వరగా పడతారు. ఉడికించిన మొక్కజొన్నను అలా సాదాగా తినేందుకే ప్రయత్నించండి.



అవసరమైతే నిమ్మకాయను రుద్దుకొని తింటే రుచి బాగుంటుంది. కానీ ఉప్పుని రాసుకోకపోవడమే అన్ని విధాలా మంచిది.