నెలసరి, గర్భధారణ, మెనోపాజ్ వంటి అనేక కారణాలతో స్త్రీ నిద్ర ప్యాటర్న్ భిన్నంగా ఉంటుంది. ఏ కారణాలతో స్త్రీలకు పురుషులకంటే ఎక్కువ నిద్ర అవసరమో తెలుసుకుందాం ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా 7-9 గంటల నిద్ర అవసరం. స్త్రీ పురుషుల శరీర ధర్మాలు, జీవ క్రియలు వేర్వేరుగా ఉండడం నిద్ర అవసరాల్లో కూడా విబేధాలు ఉన్నాయి స్త్రీలకు చాలా ఎక్కువగా నిద్ర లేమి సమస్య ఉంటుందట. నిద్ర చాలని మహిళలు పగలు నిద్ర మత్తుగా ఉండడం, ఎక్కువ కెఫిన్ వాడడం, ఇన్సోమ్నియా వంటి డిజార్డర్ల బారిన పడుతున్నారు. అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా, రెస్ట్ లెస్ లెగ్స్ సిండ్రోమ్ వంటి సమస్యలు కూడా మహిళల్లో ఎక్కువ. నెలసరులు ప్రారంభమైన వయసు నుంచి నిద్రలో లింగ బేధాలు బాగా కనిపిస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. నెలసరి సమయాల్లో, పెరిమెనోపాజ్, మెనోపాజ్, గర్భవతుల్లో రాత్రి నిద్ర బావుంటుందట. వీరితో పోలిస్తే బాలింతలు కాస్త తక్కువ నిద్రపోతారని అధ్యయనాలు సూచిస్త్తున్నాయి. Representational Image : Pexels