కంటి చూపు మెరుగు పరుచుకునేందుకు ఆయుర్వేదంలో చాలా మంచి పరిష్కారాలు ఉన్నాయి.

రాత్రి నానబెట్టిన 3-4 బాదాములు, రెండు మూడు మిరియాల పొడి కలిపిన గోరువెచ్చని పాలతో తీసుకోవాలి.

ఈ చిట్కాతో కంటి చూపు మెరుగవుతుంది.

2-5 టేబుల్ స్పూన్స్ ఊసిరి రసాన్ని ప్రతిరోజూ గోరు వెచ్చని నీటితో తీసుకుంటే కంటి ఆరోగ్యం బాగుంటుంది.

ఉసిరిలో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కంటి చూపు మెరుగవుతుంది.

త్రిఫల కషాయం నెయ్యి లేదా తేనేతో తీసుకుంటే కంటి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

త్రిఫల కషాయంతో క్రమం తప్పకుండా కళ్లను శుభ్రం చేసుకోవడం మంచిది.

ఉదయం నిద్ర లేవగానే పుక్కిట నీళ్లు పట్టి కళ్లు కడుగుకుంటే కంట్లో ఇన్ఫెక్షన్లు తొలగిపోతాయి.

భోజనం తర్వాత తడి చేయితో కంటి మీద మసాజ్ చేసుకుంటే కంటి చూపుకు నష్టం జరగకుండా ఉంటుంది.

త్రిఫల, నెయ్యి, బార్లీ, గోధుమలు, పాత బియ్యం, షైంధవ లవణం, ద్రాక్ష, దానిమ్మ, శతావరి ప్రతి రోజూ తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం బాగుంటుంది.



Representational Image : P