గుడ్డు, పన్నీర్ రెండూ కూడా ప్రొటీన్ కలిగిన పదార్థాలు.

గుడ్డు కాస్త ఉప్పగా ఉండి ఒక ప్రత్యేకమైన రుచితో ఉంటాయి. పన్నీర్ చప్పగా, క్రీమీగా ఉంటుంది.

ఈ రెండింటిలో ఏది బెటర్ ప్రొటీన్ ఆప్షన్ అనేది తెలుసుకుందాం.

ఒక ఉడికించిన గుడ్డు నుంచి 6 గ్రాముల ప్రొటీన్, 4.2 గ్రాముల కొవ్వు, ఇతర పోషకాలు అందుతాయి.

గుడ్డును రకరకాల పద్ధతుల్లో కూరగా, ఉడికించి, ఆమ్లేట్ చేసి రకరకాల వంటకాలు తయారు చేసి తినొచ్చు.

40 గ్రాముల పన్నీరు నుంచి 7.4 గ్రాముల ప్రొటీన్, 5.8 గ్రాముల కొవ్వు, బి12, విటమిన్ డి వంటి పోషకాలు అందుతాయి.

పన్నీర్ ను రకరకాల పద్ధతుల్లో వంటకాలు తయారు చెయ్యవచ్చు, సలాడ్ టాపింగ్స్ గా, సాండ్ విచ్ ఫిల్లర్లుగా తీసుకోవచ్చు.

పన్నీర్, గుడ్డు రెండింటిలోనూ ప్రొటీన్ తో పాటు ప్రొటీన్ తయారీకి దోహదం చేసే 9 విటమిన్స్ కూడా ఉంటాయి.



రెండింటిలో ఏది తిన్నా మంచిదే. ప్రొటీన్ కోసం రెండూ తీసుకోవచ్చు.
Representational Image :