మనలో బరువు తగ్గాలని అనుకునే వారే ఎక్కువ. మరి ఏం తింటే ఒంట్లో కొవ్వు కరుగుతుందో తెలుసుకుందాం. పుష్కలమైన ఫైబర్ తో ఓట్స్ పొట్ట భాగంలో కొవ్వు కరిగిస్తాయి. ఫ్యాట్ ఆక్సిడేషన్ చేసే గ్రీన్ టీతో శరీర జీవక్రియల రేటు కూడా పెరుగుతుంది. మిరపకాయల్లో క్యాప్సియాసిన్ ఉంటుంది. ఇది జీవక్రియలను క్రమబద్ధీకరిస్తుంది. క్యాలరీలను కరిగిస్తుంది. ప్రొబయోటిక్స్ కలిగి పెరుగు జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియా పెంపొందిస్తుంది. ప్రొటీన్ ఎక్కువగా ఉండే బీన్స్ లో ఫైబర్ చాలా ఎక్కువ. కనుక శరీర బరువును నియంత్రిస్తుంది. ఆకుకూరల్లో క్యాలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ. కనుక బరువు తగ్గాలని అనుకునే వారికి మంచి ఆప్షన్. ఒమెగా3 ఫ్యాటీ ఆసిడ్లు కలిగిన సాల్మన్ చేప ఫ్యాట్ కరిగిస్తుంది. Representational Image : Pexels