ఎర్రగా కనిపించేందుకు కారణమయ్యే కెరోటెనాయిడ్ లైకోపిన్ సహజంగా చర్మానికి సన్ ప్రొటెక్షన్ కలిగిస్తుంది.

లైకోపిన్ కొన్ని రకాల క్యాన్సర్ల నుంచి కూడా కాపాడుతుంది.

టమాటలు తరచుగా తినడం వల్ల బ్రెస్ట్, ప్రొస్టేట్, లంగ్ క్యాన్సర్ నివారించబడుతుంది

లైకోపిన్ ఇమ్యూన్ సిస్టం పనితీరును కూడా మెరుగు పరుస్తుంది.

టమాటల్లో ల్యూటిన్, జియాక్సంతిన్, విటమిన్ ఏ ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతాయి.

టమాటల్లో 94 శాతం నీరే ఉంటుంది. ఇందులో పొటాషియం ఉంటుంది. ఇవి శరీరం హైడ్రేటెడ్ గా ఉంచేందకు దోహదం చేస్తాయి.

జీర్ణవ్యవస్థలో ఉండే మంచి బ్యాక్టీరియా టమాటల వల్ల వృద్ధి అవుతుంది. తద్వారా జీర్ణ వ్యవస్థ ఆరోగ్యం బావుంటుంది.

తాజా టమాటల్లో క్యాలరీలు తక్కువ. ఫైబర్ ఎక్కువ. నీళ్ల కూడా ఎక్కువ. కాబట్టి బరువు తగ్గేందుకు ఇవి మంచి ఆప్షన్.

తరచుగా టమాటలు తినడం వల్ల వీటిలోని యాంటీ ఆక్సిడెంట్ల వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది.

Representational Image : Pexels