కొబ్బరి నీళ్లు తక్కువ క్యాలరీలతో ఉండే షుగర్ కలిగిన పానీయంగా చెప్పుకోవచ్చు.

ఒక కప్పు కొబ్బరి నీళ్ల ద్వారా కేవలం 45 క్యాలరీలు మాత్రమే అందుతాయి. ఇవి అందరికీ అవసరమా? నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

కొబ్బరి నీళ్ల డీహైడ్రేషన్ సమస్యతో బాధపడే వారికి తప్ప అందరికీ ప్రతి రోజూ అవసరం ఉండదని నిపుణులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లతో ఇమ్యూనిటి బలపడుతుంది. పొద్దున్నే జీవక్రియల ఆరంభానికి దోహదం చేస్తుంది.

శారీరక శ్రమ తర్వాత లేదా వర్కవుట్ తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేసేందుకు కొబ్బరి నీళ్లు ఉత్తమ పానీయం.

కొబ్బరి నీళ్లలో ఎక్కువ మొత్తంలో ఉండే పోటాషియం వల్ల కిడ్నీ సమస్యలు, గుండె లయ సమస్యలు ఉన్నవారికి సమస్యగా మారవచ్చు.

కొబ్బరి నీళ్లలో చక్కెరలు ఉంటాయి.. కనుక ఎవరు కొబ్బరినీళ్లు తీసుకున్నా సరే పరిమితులు పాటించాలి.

కొబ్బరి నీళ్లు తీసుకుంటే కలిగే ఫలితాలు ఒకొక్కరికి ఒక్కోవిధంగా ఉంటాయి. కనుక పరిమితులు కూడా భిన్నంగా ఉంటాయి.

Representational Image : Pexels