గులాబ్ జామూన్‌లను ఎన్ని దేశాల్లో తింటారంటే...



పర్షియా పదమైన గోల్ అబ్ జమన్ నుంచి గులాబ్ జామూన్ పుట్టకొచ్చింది.



మనదేశంతో పాటూ శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, థాయ్ లాండ్, జమైకా దేశాల్లో దీన్ని ఇష్టంగా తింటారు.



నేపాల్‌లో దీన్ని లాల్ మోహన్ అని పిలుస్తారు.



పెళ్లయినా, పుట్టిన రోజయినా ఇంట్లో గులాబ్ జామూన్ ఉండాల్సిందే.



మొఘల్ చక్రవర్తి షాజహాన్ వంటశాలలో తొలిసారి గులాబ్ జామూన్ తయారైనట్టు చరిత్ర చెబుతోంది.



బ్రిటిషర్లకు భారతదేశంలో ఇష్టమైన స్వీటు గులాబ్ జామూన్.



2016లో ప్రపంచంలోనే అతి పెద్ద గులాబ్ జామూన్ మనదేశంలో తయారు చేశారు. దీని బరువు పాతిక కిలోలు.



ఇప్పుడు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా గులాబ్ జామూన్ అమ్మకాలు పెరిగిపోయాయి.