తిన్న తర్వాత స్నానం చెయ్యకూడదు. పొట్ట భాగంలో రక్తప్రసరణ మందగిస్తుంది.

అందువల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. బ్లోటింగ్ వంటి సమస్యలు రావచ్చు.

భోజనానికి ముందు లేదా భోజనం తర్వాత వెంటనే తర్వాత వెంటనే పండ్లు తినకూడదు. ఇలా చేస్తే పొట్ట పెరిగే ప్రమాదం ఉంటుంది.

భోజనం తర్వాత టీ కాఫీలు తీసుకోవద్దు. వీటిలో ఉండే కెఫిన్ పోషకాల శోషణకు అడ్డుతగులుతుంది.

తిన్న వెంటనే వాకింగ్ చెయ్యొద్దు. ఒక పది నిమిషాలు ఆగి చేస్తే జీవక్రియలు వేగవంతం అవుతాయి.

తిన్న వెంటనే నిద్రపోవద్దు. తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి.

చాలా మంది తిన్న వెంటనే చల్లగా నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అది మంచిదికాదు.

ఒక ఐదు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.

తినగానే పళ్లు తోముకోవద్దు. గంట ఆగి పళ్లు తోముకోవడం మంచిది.
Representational Image : Pexels