ఎర్రటి పెదవుల కోసం ఇలా చేయండి



పెదాలు ఎర్రగా, తాజాగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.



ధూమపానం, మద్యపానం, గాలి కాలుష్యం వల్ల పెదాలు నల్లగా మారిపోతాయి. అవి తాజాగా మారాలంటే ఇలా చేయాలి.



ప్రతి రోజూ అయిదు నిమిషాల పాటూ లిప్ మసాజ్ చేయాలి.



బాదం నూనెలో నిమ్మరసం వేసి దానితో పెదాలను రుద్దుతూ ఉండాలి.



టమాటో గుజ్జులో కొబ్బరి నూనె వేసి పెదాలకు రాస్తే అవి గులాబీ రంగులోకి మారుతాయి.



రాత్రి పడుకునే ముందు పాల మీగడను పెదాలకు రాసుకుంటే మంచిది.



నారింజతొక్కతో అప్పుడప్పుడు పెదాలు రుద్దుతూ ఉండే మంచిది.