పియర్స్ లో విటమిన్ సి, కే తోపాటు పొటాషియం వంటి ఖనిజలవణాలు కూడా ఉంటాయి.

ఈ పోషకాలన్నీ కూడా శరీరానికి అత్యావశ్యకమైనవే.

పీయర్స్ లో ఫైబర్ ఎక్కువ. జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది.

శరీరంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చేస్తుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

విటమిన్ సి, ఫ్లవనాయిడ్స్ ఉంటాయి . ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడుతాయి.

ఫలితంగా దీర్ఘకాలిక అనారోగ్యాల బారిన పడకుండా నివారిస్తుంది.

పియర్స్ లో ఉండే పొటాషియం రక్తపోటు అదుపులో ఉంచేందుకు దోహదం చేస్తుంది. గుండె ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.

ఇందులో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ కనుక శరీర బరువును కూడా నియంత్రణలో ఉంచుతుంది.

ప్రీరాడికల్ చర్యలు నియంత్రించడం వల్ల ఆక్సిడేషన్ ఒత్తిడి తగ్గి చర్మ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుతుంది.

ఇన్ఫ్లమేషన్ తగ్గించడం, కొన్ని రకాల క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది.
Representational Image : Pexels