విటమిన్ బి12 ను కోబాలమైన్ అంటారు. ఇది నీటిలో కరిగే విటమిన్. ఇది డీఎన్ఏ సంశ్లేషణకు అవసరం.

తగినంత బి12 కలిగిన ఆహారం తీసుకోకపోతే లివర్ బి12 ను నిల్వచేస్తుంది.

విటమిన్ బి12 తగ్గినపుడు గోళ్లలో అందుకు సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. అవేమిటో చూద్దాం.

బి12 తగ్గినపుడు గోళ్లు పొడి బారి, పెళుసుగా మారుతాయి.



బి12 తగ్గితే అనిమియా కూడా అవుతుంది. అందువల్ల గోళ్ల రంగు పాలిపోయినట్టుగా మారుతుంది.



కొయిలోనేషియా అనే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ స్థితిలో గోళ్లు స్పూన్ ఆకృతిగా మధ్య భాగంలో గుంతగా మారుతాయి.



బి12 తగ్గినపుడు శరీరంలో ఐరన్ కూడా తగ్గి అనిమియా అవుతుంది. ఫలితంగా గోళ్లకు ఆక్సిజన్ అందక గోళ్లు లేత నీలం రంగులోకి మారుతాయి.



Representational Image : Pexels