గులాబీ రేకుల్లో ఉండే కొన్ని ప్రత్యేక సమ్మేళనాల వల్ల శరీరంలో నుంచి వ్యర్ధాలు బయటకు వెళ్లిపోతాయి. జీవక్రియల వేగంపెరగుతుంది. ఈ రెండు ప్రక్రియల వల్ల శరీర బరువు తగ్గుతుంది. గులాబీ రేకుల అరోమా వల్ల నిద్ర లేమి, ఒత్తిడి, నీరసం, అసహనం తగ్గి విశ్రాంతి లభిస్తుంది. గులాబి రేకుల్లో విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు పుష్కలం. ఫ్రీరాడికల్ ప్రతి చర్య నుంచి చర్మాన్ని కాపాడుతాయి. కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మీద వయసు ప్రభావాన్ని తగ్గిస్తాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల వల్ల ఇమ్యూన్ వ్యవస్థ బలోపేతం అవుతుంది. మహిళల్లో నెలసరి సమస్యలకు గులాబీ రేకుల టీ ఒక మంచి పరిష్కారం. కడుపులో నొప్పి, ఒళ్లు నొప్పులు తగ్గిస్తుంది. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో గులాబి రేకులు మంచి మాయిశ్చరైజర్ మాత్రమే కాదు మొటిమలను కూడా తగ్గిస్తాయి. పెదవుల మీది మృతకణాలను తొలగించి సహజంగా లేత రంగులో కనిపించేందుకు దోహదం చేస్తాయి. ఆరబెట్టిన గులాబి రేకులను ఆహారంలో లేదా టీ రూపంలో భోజనం తర్వాత తీసుకుంటే రక్తంలోకి గ్లూకోజ్ త్వరగా చేరకుండా నివారిస్తుంది. మధుమేహులకు గులాబి టీ మంచి ఔషధం వంటిది. Representational Image : Pexels