స్త్రీలు తాము ఎంతో ప్రేమించిన పురుషులను కూడా వదిలేస్తుంటారు. అలా వదిలెయ్యడానికి కొన్ని కారణాలను నిపుణులు వివరిస్తున్నారు. అసలు స్త్రీలు పురుషుల నుంచి ఆశించేదేమిటో తెలుసుకుందాం. ఎంత ఉత్తముడైనా సరే అటెంటివ్ గా లేకపోతే తమను నిర్లక్ష్యం చేస్తున్నట్టు భావించి అతడిని వదిలేస్తారట. పక్కనే ఉండి కూడా మానసికంగా ఎక్కడో ఉండడాన్ని స్త్రీలు భరించలేరట. మహిళలు వారి పురుషుడు వారి పట్ల శ్రద్ధ వహించాలని ఆశిస్తారట. రోజులో కనీసం 10 నిమిషాల పాటైన తమ మీద శ్రద్ధ చూపని పురుషులను స్త్రీలు చాలా సులభంగా వదిలేస్తారట. మైండ్ ఆబ్సెంట్ గా ఉండకపోవడం, వారి మీద కాస్త శ్రద్ధ చూపడం పురుషుల నుంచి స్త్రీలు కోరుకుంటారు. Representational image:Pexels