తేనె, దాల్చిన చెక్క కలిపి తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి అవేమిటో తెలుసుకుందాం.

దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటి పెంచుతుంది. కాబట్టి డయాబెటిక్స్ రక్తంలో గ్లోకోజ్ తగ్గిస్తుంది.

దాల్చిన చెక్క మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతూ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. కనుక గుండె ఆరోగ్యానికిమంచిది.

తేనే, దాల్చిన చెక్క రెండూ కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలతో ఉంటాయి.

క్రమం తప్పకుండా దాల్చీని, తేనె కలిపి తీసుకుంటే ఇన్ఫెక్షన్లకు దూరంగా ఉండొచ్చు.

తేనె, దాల్చిన చెక్క జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. మలబద్ధకాన్ని నివారిస్తాయి. కడుపు నొప్పి తగ్గుతుంది.

దాల్చిన చెక్క ప్రతిరోజూ తీసుకుంటే బరువు తగ్గుతారని అధ్యయనాలు తేల్చాయి.

శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో తేనె, దాల్చిని చెక్క సహాయపడుతాయి.

ఈ మిశ్రమం ఆర్థరైటిస్, ఆస్తమాతో సహా అనారోగ్య లక్షణాలెన్నింటినో తగ్గించ గలదు.

Representational image:Pexels